అన్నమ్మ గారు శ్రీమతి ఆరోగ్యమ్మ,శ్రీ జోసెఫ్ పుణ్య దంపతులకు 17 జులై 1947 లో నెల్లూరు లో జన్మించారు, తాత కోట్లపుడి దేవదాసు. పల్లెటూళ్ళకు తిరిగి వైద్యసహాయం అందిస్తూ ఉండేవారు. 12 సంవత్సరాలపాటు అన్నమ్మగారు తాతగారి ఆలనా పాలనలోనే పెదిగారు. తాతాగారి ప్రేమను చూరగొనడమే కాదు; మామయ్యల గారాబాల ముద్దు బిడ్డగా పెరిగింది. అన్నమ్మ గారికి ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు.
విద్యాభ్యాసం:
నేల్లోరేలోని సేన్ జోసెఫ్ స్కూల్ లో అన్నమ్మ ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశారు. ఆ రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి., టెన్త్ క్లాసు లాంటివి లేవు. ఈ విద్యార్హతకు సమాన స్థాయిగా పరిగణించే హెచ్.ఎస్.సి. ఉండేది. అది చదివాక డాక్టర్ కోర్సు పరీక్షలో అర్హత సాధించి గుంటూరు మెడికల్ కాలేజీలో చేరి రెండు వారాలపాటు క్లాసు లకు కూడా వెళ్ళడం జరిగింది. చిన్నప్పటినుంచి అమ్మలాంటి ఆప్యాయతతో అక్క వద్ద పెదిగిన ఆ చెల్లెలు డాక్టర్ చదువు కోసం తనను విడిచి గుంటూరు వెళ్ళిపోవడం తో అక్కపై బెంగాపెట్టుకొని ఆరోగ్యం విషమించే పరిస్థితికి వచ్చేసరికి డాక్టర్ చదువును అర్థాంతరంగా వదిలేసి తన చేల్లెలిదగ్గరకు వెళ్ళిపోయారు అన్నమ్మగారు.ఆ తర్వాతా బి.ఎ.చదవడం జరిగింది.
వివాహం,సంతానం:
అన్నమ్మగారికి 1971 లో శ్రీ తలారి డానియెల్ గారితో వివాహం జరిగింది.వారికి నలుగురు సంతానం. టి.ఎస్.వి.వరప్రసాద్(అమెరిక) జాన్ అనీల్ కుమార్ (జర్మనీ) ,జాషువ ప్రవీణ్ కుమార్ (ఆస్ట్రేలియా)లు విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఉండగా చిన్న కుమారుడు రత్నకుమార్ విశాఖపట్నంలో తల్లి చెంతనే ఉన్నాడు. ప్రేమలత,ప్రియాంక లిజ్, ఎమిమా ప్రశాంతి ఎలిషా,కాంతి సుధలు అన్నమ్మ గారి కోడళ్ళు.
ఉద్యోగం:
విశాఖపట్నంలోని న్యూ కాలోనీ మునిసిపల్ హైస్కూల్ లో 1973 లో గ్రేడ్ 2 తెలుగు పండిట్ గా అన్నమ్మగారు ఉపాద్యాయ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం వీసి శ్రీ లంకపల్లి బుల్లయ గారు చొరవ తీసుకొని అదనంగా ఒక సీటు పెంచడం వల్ల అన్నమ్మగారు విజయ నగరం ఎం.ఆర్.కాలేజీ లో బి.ఇడి. చేరి చదివి ప్రాక్టికల్స్, థియరీలలో ప్రథమ శ్రేణిలో పాసయ్యారు అన్నమ్మగారు. 78 లో బి.ఇడి.పోస్టు సంపాదించారు. అన్నమ్మ గారు మంచి ఉపాధ్యాయనిగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. టీచింగ్ ఎయిడ్స్,బోధనోపకరణలు, బోధనాంశాల వల్లే తానూ చక్కగా బోధించా గలిగానని, అందువల్లే తనకు అవార్డ్లు రివార్డ్లు వచ్చాయని అన్నమ్మగారు పేర్కొన్నారు. చాడువుకునేప్పటి నుంచే ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవం. ఆమెకూడా టీచర్ కావడానికి తనకు బోధించిన ఉపాధ్యాయులే ప్రేరణ అని అన్నమ్మ అంటారు. సహనం...ఓర్పు...ప్రేమతో విద్యార్థులను మంచి మార్గంలోకి తీసుకు రావచ్చని నమ్మి సాధించి చూపిన ఆదర్శ ఉపాధ్యాయురాలు అన్నమ్మ.
సంచాయక బ్యాంకు:
విరామ సమయంలో పిల్లలకు బ్యాగులు తయారీ, అల్లికలు నేర్పించి అలా తయారు చేసినవి ఉపాధ్యయులకే అమ్మించి డబ్బును సంపాదించడం, పొడుపు చెయ్యడం అన్నమ్మ గారు విద్యార్థులకు నేర్పారు.ఈ విధంగా సంపాదించి 2 సంవత్సరాల వ్యవధిలోనే కూడబెట్టిన సొమ్ము 65 ,000 వేల రూపాయలు.
No comments:
Post a Comment